తెలంగాణలో విజయశాంతి విషయంలో కొన్ని కొన్ని అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. విజయశాంతి ప్రజల్లోకి వెళ్లి అంశానికి సంబంధించి కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె గతంలో మెదక్ ఎంపీగా పని చేసినా సరే ఆ నియోజకవర్గంలో కూడా ఆమె ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. దీనితో విజయశాంతి విషయంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొన్ని సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటుంది.
ఆమెకు ఇచ్చే పదవి విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టత రావడం లేదు. అసలు ఆమెను నియోజకవర్గానికి పంపించాలి అనేదాని పై కూడా స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు కొన్ని సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి అనే భావన ఉంది. రాజకీయంగా తెలంగాణలో విజయశాంతికి భవిష్యత్తు లేదని కాబట్టి ఆమెను సినిమాలు చేసుకుంటే మంచిదనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
అయితే విజయశాంతి మాత్రం తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ప్రజాసేవ చేస్తాను అని ముందుకు వస్తున్నారు. వాస్తవానికి విజయశాంతి ఆర్థికంగా కూడా పెద్ద బలంగా ఉన్న నేత కాదు. అయినా సరే ఆమె వ్యక్తిగత ఇమేజ్ కారణంగా కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆమె విషయంలో పక్కన పెట్టడానికి ఆర్థిక సమస్యలే కారణమని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయని అందుకే ఆమె పెద్దగా బయటకు రావడం లేదని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.