తెలంగాణలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.. షెడ్యూల్ ప్రకారం ఏదో రకంగా కండక్ట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు. పరీక్షలు జరగక పోతే విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయని భావనలోనే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభం కావల్సిన ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు మొన్న వెల్లడించింది. వాయిదా పడిన ప్రాక్టికల్ పరీక్షలు మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.