ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అయిన జగన్…

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కువగా తప్పులు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన సరే కొంతమంది తప్పులు ఎక్కువగా చేయడంతో వైసీపీ నష్టపోతుంది. అయితే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఎమ్మెల్యేలకు చాలావరకు అవగాహన ఉన్నట్టు కనపడటం లేదు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సంతోషంగా ఉన్నారు. అందుకే ఆయన అన్ని జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుని తేదీలను కూడా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చని సమాచారం.

వచ్చెది వేసవి కాలం కావడంతో జగన్ పర్యటనలకు వెళ్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా చూస్తే పార్టీ విజయం సాధించాలి అంటే కచ్చితంగా జగన్ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలకు కూడా ఈ అంశానికి సంబంధించి జగన్ ఒక సమాచారం కూడా ఇచ్చారని సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులతో కూడా మాట్లాడుతున్నారు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version