ఆ ఐదు జిల్లాలే జగన్‌కు అధికారం ఇచ్చేది…!

-

ఏపీలో జగన్‌కు ఎప్పుడు అండగా నిలబడే జిల్లాలు ఏవి అంటే..ఠక్కున కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలని చెప్పేయొచ్చు. ఈ జిల్లాలు ఎప్పుడు జగన్‌ని ఎక్కువగా ఆదరిస్తూ వస్తున్నాయి. 2012 ఉపఎన్నికలు కావొచ్చు, 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు…ఏ ఎన్నికలైన సరే ఈ జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం. అయితే ఇవే జిల్లాలు వచ్చే ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రావడానికి అండగా ఉంటాయని విశ్లేషణలు వస్తున్నాయి.

ఎందుకంటే ఇప్పుడుప్పుడే అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈ సారి వైసీపీకి రాదని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ కిందకు పడిపోకూడదని వైసీపీ భావిస్తోంది. 175 స్థానాలున్న ఏపీలో మ్యాజిక్ ఫిగర్ 88 …అంటే 88 సీట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. 2014 ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్‌కు 21 సీట్లు దూరమయ్యి, అధికారానికి దూరమైంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.

మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. అంటే మళ్ళీ వైసీపీకి 151 సీట్లు వచ్చే ఛాన్స్ లేదు. అలా అని మ్యాజిక్ ఫిగర్ కిందకు వెళ్లకుండా చూసుకోవాలి. అయితే వైసీపీకి మ్యాజిక్ ఫిగర్‌ని దాటించేవి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలే అని తెలుస్తున్నాయి.  గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి.

ఈ సారి కూడా ఆయా జిల్లాల్లో వైసీపీకే లీడింగ్ వస్తుందని తెలుస్తోంది. ఈ ఐదు జిల్లాలు కలిపి మొత్తం 60 సీట్లు ఉన్నాయి…ఇందులో 50 గెలుచుకుని, మిగిలిన జిల్లాల్లో కొన్ని సీట్లు గెలుచుకుంటే చాలు..నెక్స్ట్ కూడా వైసీపీదే అధికారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version