ఇండియన్‌ నేవీలో 302 జాబ్స్‌.. ఇలా అప్లై చేసుకోండి..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఇండియన్‌ నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 302 ట్రేడ్స్‌మెన్‌ (స్కిల్డ్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటిలో డిసిగ్నేటెడ్‌ ట్రేడ్‌, నాన్‌ డిజిగ్నేటెడ్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో మొత్తం 302 పోస్టులు వున్నాయి. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల లోపువారై ఉండాలి.

పోస్టుల వివరాలని చూస్తే… మెషినిస్ట్‌- 16, ప్లంబర్‌/పైప్‌ ఫిట్టర్‌- 8, పెయింటర్‌- 7, టైలర్‌- 6, వెల్డర్‌- 20, మెకానిక్‌ ఎంటీఎం- 7, వెల్డర్‌ షిప్‌ ఫిట్టర్‌- 3, షీట్‌ మెటల్‌ వర్కర్‌- 1 (డిజైన్‌డ్‌ పోస్టులు), ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌- 46, ఎలక్ట్రిషన్‌- 29, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌- 8, ఫిట్టర్‌- 37, డీజిల్‌ మెకానిక్‌- 42, ఆర్‌ఈఎఫ్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌- 11, షీట్‌ మెటల్‌ వర్కర్‌- 18, కార్పెంటర్‌- 33, మాసన్‌- 7, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌- 1 (నాన్‌ డిజైన్‌డ్‌ పోస్టులు). అయితే అప్లై చేసుకునేవారు ఆఫ్ లైన్ మోడ్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: https://www.indiannavy.nic.in/

చిరునామా:

HE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL),
NAVAL SHIP REPAIR YARD (PBR),
POST BOX NO. 705, HADDO,
PORT BLAIR – 744102,
SOUTH ANDAMAN

Read more RELATED
Recommended to you

Exit mobile version