బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నిర్ణయం తీసుకున్న జగన్ !

-

కుర్రతనం లో రాజకీయంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ముఖ్యమంత్రి అయినా వైయస్ జగన్ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో దాదాపు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే విధంగా అసెంబ్లీలో అటు ఇటు ఊగిసలాట ల మధ్య చంద్రబాబు ని జగన్ ప్రతిపక్షానికి పరిమితం చేశాడు. అయితే అధికారంలో ఉన్న జగన్ రాజకీయంగా తనకి చంద్రబాబు హయాంలో అనేక ఇబ్బందులకు గురి చేసిన తెలుగుదేశం పార్టీ నేతలను గట్టిగానే టార్గెట్ చేసినట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి అర్థమవుతుంది.

మేటర్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు హయాంలో జగన్ ని భయంకరమైన బూతులు మీడియా ముందే తిట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం జగన్ అధికారంలోకి రావడంతో ఒకపక్క ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారు మరోపక్క తన రాజకీయ ప్రత్యర్థులకు బాకీ తీర్చుకునే పని స్టార్ట్ చేశారు. జేసీ దివాకర్ రెడ్డికి ఆర్థికంగా కనబడని దెబ్బలు ప్రస్తుత ప్రభుత్వంలో తగులుతున్నట్లు తెలుగుదేశం పార్టీలో టాక్ గట్టిగా వినబడుతుంది.

 

ఇందులో భాగంగా  ముందుగా ఆయన బస్సుల మీద పడిన వైసీపీ సర్కార్ ఇపుడు ఆయనకు లీజుకు ఇచ్చిన సున్నపు రాయి గనుల మీద పడింది. అయితే తాజాగా జేసీ కుటుంబాన్ని ఫోర్జనీ కేసులు వెంటాడుతున్నాయి. ఈ దెబ్బతో జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి బోరున ఏడ్చిన ట్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుగు దేశం పార్టీ లో వార్తలు వస్తున్నాయి.

 

ఇదే తరుణంలో వైయస్ జగన్ చంద్రబాబు ని కూడా రాజకీయంగా తొక్కి వేయడానికి ఆయన పార్టీ నేతలనే ఆయన సామాజిక వర్గం చెందిన వాళ్లనే ఉసిగొలిపే ప్రయత్నాలు స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో బాబుకు అనుకూలంగా పని చేసిన అధికారుల పై వారు చేసిన అవినీతి మొత్తం బయట పెట్టడానికి బాబు కి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా కేంద్ర ప్రభుత్వం తో కలిసి ఒక సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో వినబడుతున్న టాక్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version