ఖైదీగా నటించనున్న హృతిక్ రోషన్….??

-

యువ నటుడు కార్తీ హీరోగా కోలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన ఖైదీ సినిమా ఇటు తెలుగు లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఒక మంచి పాయింట్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ తన సహజ నటనతో ప్రేక్షకులను ఎంతో అలరించాడు. యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితం అయింది. కొన్నేళ్ల పాటు శిక్షను అనుభవించిన ఒక ఖైదీ, జైలు నుండి రిలీజ్ అయిన తరువాత తన కూతురుని కలుసుకునే క్రమంలో ఎదురైన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. ఎటువంటి కమర్షియల్ హంగులు,

పాటలు వంటివి లేకుండా సినిమా స్క్రీన్ ప్లే ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు లోకేష్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. ఇక ఇటీవల ఈ సినిమా హిందీ హక్కులను రిలయన్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ లో హీరోగా ఎవరు నటిస్తారు అనే దానిపై మాత్రం మొన్నటివరకు స్పష్టత లేదు. ఇక నేడు కొన్ని బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు టాక్. ఎప్పటికప్పుడు ఇటీవల మంచి ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటున్న హృతిక్ ఇటీవల సూపర్ 30, వార్ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే.

 

అయితే ఈ సినిమా విషయమై ఇటీవల హృతిక్ ని సంప్రదించిన రిలయన్స్ సంస్థ ప్రతినిధులు, ఆయనకు కథని వినిపించడం జరిగిందట. అయితే తాను ఇదివరకు ఆ సినిమాని చూశానని, తనకు సినిమా పాయింట్ ఎంతో బాగా నచ్చిందని చెప్పిన హృతిక్, హిందీ వర్షన్ లో నటించడానికి వెంటనే ఒప్పుకున్నట్లు టాక్. అలానే మరికొద్దిరోజుల్లో ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు చెప్తున్నారు. మరి ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version