శివసేనకు చెందిన అధికారిక పత్రిక సామ్నాలో జగన్‌ను పొగుడుతూ సంపాదకీయం రాశారు. అందులో జగన్ విజయంపై ఆయన్ను అభినందిస్తూ రాశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైకాపాకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తుంటే.. సీఎంగా ప్రమాణం చేసిన ఆ పార్టీ అధినేత జగన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. జాతీయంగా పేరుగాంచిన పలు పార్టీల నేతలు, ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌పై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి పార్టీని భారీ తేడాతో ఓడించి జగన్ అఖండ విజయం సాధించారని, జగన్ ఒక విజయవీరుడు అని శివసేన తెలిపింది.
శివసేనకు చెందిన అధికారిక పత్రిక సామ్నాలో జగన్‌ను పొగుడుతూ సంపాదకీయం రాశారు. అందులో జగన్ విజయంపై ఆయన్ను అభినందిస్తూ రాశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాదించిన వైకాపాతోపాటు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ను అందులో ప్రశంసించారు. ఇక ఇవాళ జరగనున్న మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాకపోవడాన్ని శివసేన తప్పుబట్టింది. మోదీ మరోసారి ప్రధాని అయితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయని, మోదీ ఒక నియంత అని అన్నవారిలో మమతాబెనర్జీ కూడా ఉన్నారని అందుకే ఆమె మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని శివసేన ఆరోపించింది.
ఇక ప్రధాని మోదీ గత 5 సంవత్సరాల కాలంలో తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారని, అందుకే ఆయన రెండోసారి పీఎం అయ్యారని శివసేన తెలిపింది. కొత్త ప్రభుత్వం మరింత నిబద్ధతతో పనిచేస్తుందన్న విశ్వాసం తమకు ఉందని, ప్రజల ఆకాంక్షతో మోదీ పాలన కొనసాగిస్తారని, దేశంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా ఆయన పరిష్కరిస్తారని శివసేన ఆ సంపాదకీయంలో రాసుకొచ్చింది.