పొంగులేటితో జగన్ పాలిటిక్స్..రేవంత్‌కు చెక్..!

-

తెలంగాణ రాజకీయాల్లో జగన్ వేలు పెడతారా? అంటే అబ్బే అసలు అలాంటిదేమీ ఉండదు. ఆయన ఏపీ వరకే చూసుకుంటారు..తెలంగాణ రాజకీయాల జోలికి వెళ్లరు. అందుకే కదా అక్కడ వైసీపీని కూడా మూసేశారు అని అంటారు. అవును ఇది నిజమే. 2014లో 3 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలిచిన సరే…జగన్ ఏపీపై ఫోకస్ పెట్టి..తెలంగాణని వదిలేశారు. అక్కడ పార్టీని మూసేశారు.

ఇక అక్కడ రాజకీయాలతో జగన్‌కు సంబంధంలేదు. అయితే ప్రత్యక్షంగా జగన్ కు అక్కడ రాజకీయాలతో సంబంధం లేదు గాని…పరోక్షంగా మాత్రం కాస్త ఉందనే చెప్పాలి. అది కూడా అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటుందో..ఆ పార్టీతో సఖ్యతగా ఉండటం జగన్‌కు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. ఎలాగో గత రెండు పర్యాయాల నుంచి బి‌ఆర్‌ఎస్ అధికారంలో ఉంది కాబట్టి..కే‌సి‌ఆర్ తో సఖ్యతగా ఉంటారు. కే‌సి‌ఆర్, జగన్ మిత్రులుగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు..అటు తెలంగాణ, ఇటు ఏపీలో చంద్రబాబుకు చెక్ పెట్టారు.

ఇలా కే‌సి‌ఆర్‌కు మిత్రుడుగా ఉంటూ..ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకెళుతున్నారు. ఈ విధంగా ముందుకెళ్లడానికి కారణం..జగన్ కు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి…వ్యాపారాలు ఉన్నాయి.. కాబట్టి జగన్..ఎవరు అధికారంలో ఉంటే వారితో సఖ్యతగా ఉంటారు. అయితే నెక్స్ట్ పొరపాటున కే‌సి‌ఆర్ ఓడిపోయి..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్తితి అనుకోవచ్చు. దానికి కూడా ప్లాన్-బి ఉంది.

అది ఏంటంటే..ఇప్పటికే తన సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరక ముందు..చేరిన తర్వాత జగన్ తో భేటీ అయ్యారు. అంటే రాజకీయంగా వారి మధ్య ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తన మనిషి పొంగులేటి ఎలాగో ఉన్నారు..కాంగ్రెస్ అధిష్టానం జగన్ కు దూరమైన సరే..పొంగులేటి ద్వారా తనకు ఎలాంటి ఇబ్బందులు చూసుకోవడమే జగన్ లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు సన్నిహితుడైన రేవంత్ రెడ్డికి చెక్ పెట్టి అధికారం పొంగులేటి చేతుల్లోకి వచ్చేలా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే జగన్‌కు కే‌సి‌ఆర్ అధికారంలోకి వచ్చిన ఇబ్బంది లేదు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇబ్బంది లేదన్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version