వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షం మరోసారి నిరూపించుకున్న జగన్ సర్కారు

-

ఇటీవల కొవ్వూరులో జరిగిన దళిత యువకుడు మహేంద్ర ఉదంతంపై ప్రభుత్వం స్పందించిన తీరు సర్వత్రా ప్రశంశలు అందుకుంటోంది. ఈ ఘటన తెలిసినవెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలిచారన్నారు.ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు బాధిత కుటుంబ సభ్యులు కూడా. మహేంద్ర ఉదంతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని వారు విజ్ఞప్తిచేశారు.విషయం తెలిసిన వెంటనే కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా మంత్రి మేరుగ నాగార్జునను ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు వారు వచ్చి తమ కుటుంబానికి ఓదార్పునిచ్చారన్నారు.

 

మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో తమ కుటుంబం వెన్నంటి ఉన్న జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బాధిత కుటుంబ సభ్యులు అన్నారు.మహేంద్ర ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దయచేసి ఈ సంఘటనను రాజకీయాలు చేయొద్దని మహేంద్ర కుటుంబ సభ్యులు విజ్క్షప్తి చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version