చేవెళ్ళలో ట్విస్ట్: యాదయ్యకు హ్యాట్రిక్ ఛాన్స్ ?

-

తెలంగాణ వచ్చాక బి‌ఆర్‌ఎస్ పార్టీకి లక్ మామూలుగా లేదనే చెప్పాలి.. తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక మూడోసారి కూడా గెలవాలని చూస్తుంది. అయితే తెలంగాణ సెంటిమెంట్ తో చాలామంది నేతలు వరుసగా గెలుస్తున్నారు. అలా సెంటిమెంట్ తోనే చేవెళ్ళలో కాలే యాదయ్య వరుసగా రెండుసార్లు గెలిచారు. అసలు చేవెళ్ళ అంటే ఒకప్పుడు టి‌డి‌పి, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా గెలిచేవి.

1985, 1989, 1994, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి గెలవగా, 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది. అయితే అక్కడ పటోళ్ళ ఫ్యామిలీకి పట్టు ఎక్కువ.. టి‌డి‌పి నుంచి ఇంద్రారెడ్డి మూడుసార్లు గెలిచారు..ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళి 1999 ఎన్నికల్లో గెలిచారు. ఆయన మరణించడంతో..ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి భార్య 2000 చేవెళ్ళ ఉపఎన్నికలో గెలిచారు. 2009లో చేవెళ్ళ ఎస్సీ స్థానంగా మారింది. అప్పుడు టి‌డి‌పి నుంచి కే‌ఎస్ రత్నం పోటీ చేసి గెలిచారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో 2014, 2018లో వరుసగా యాదయ్య గెలుస్తూ వచ్చారు.

అలా వరుసగా గెలిచిన యాదయ్య..ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఆయనకు హ్యాట్రిక్ ఛాన్స్ ఉందా? అంటే ఈ సారి కాస్త టఫ్ అని చెప్పవచ్చు. చేవెళ్ళలో కాంగ్రెస్ తో పాటు బి‌జే‌పి బలపడుతున్నాయి. అదే సమయంలో యాదయ్యకు సొంత పార్టీలో పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే కే‌ఎస్ రత్నం బి‌ఆర్‌ఎస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కూడా ఈ సారి సీటు కోసం ట్రై చేస్తున్నారు.

రెండుసార్లు గెలవడంతో యాదయ్యపై కాస్త వ్యతిరేకత ఉంది. అలా అని ఆయనకు సీటు ఇవ్వకుండా ఉంటారా? అనేది చెప్పలేం. మళ్ళీ ఆయనే పోటీ చేయవచ్చు. ఇక బి‌జే‌పి, కాంగ్రెస్‌ల మధ్య ఓట్లు చీలితే యాదయ్యకు హ్యాట్రిక్ ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఈ సారి చేవెళ్ళలో ఎలాంటి ఫలితం వస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version