తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అవినీతి జరుగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముఖ్య మంత్రి కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రూ. 36,000 వేల కోట్లు ఉంటే.. దానిని రూ. లక్ష కోట్లు అని తప్పుగా చూపారని ఆరోపించారు. మిగితా డబ్బులు అంతా అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని ఉపేక్షించమని అన్నారు. వంటి ఘాటూ వ్యాఖ్యలతో ఆరోపించారు.
అలాగే మిషన్ భగిరథా నీళ్లు ఎక్కడా రావడం లేదని విమర్శించారు. మిషన్ భగిరథా నీళ్లు కేవలం కేసీఆర్ ఫాం హౌస్ లోనే నీళ్లు వస్తున్నాయని ఆరోపిచారు. తము ధర్మ యుద్ధం చేస్తామని అన్నారు. అలాగే హూజురాబాద్ ఉప ఎన్నికలలో ఓటమి పాలు అయిన తర్వాత కేసీఆర్ మెంటల్ గా డిస్టబ్ అయ్యాడని వ్యగ్యంగా ఆరోపించారు. అలాగే కేసీఆర్ నియంతృత్వ రాచరిక పాలన పై తాము ప్రజా ఉద్యమం చేస్తామని ప్రకటించారు. అలాగే బండి సంజయ్ అరెస్టు నిరసనగా 14 రోజుల పాటు జాతీయ నాయకులు వచ్చి ఆందోళన చేస్తామని ప్రకటించారు.