‘ కందాళ ‘ ఎంట్రీతో పాలేరు రూపురేఖ‌లు మారాయ్‌… ఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా..!

-

ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నే త‌లంపు.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి మేలు చేయాల న్న ల‌క్ష్యం ఆయ‌న‌ను అలుపెరుగ‌ని శ్రామికుడిగా మార్చాయి. పాలేరు నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధిలో ప‌య‌నించేలా చేస్తున్నాయి. ఆయ‌న చ‌ర్య‌ల‌తో రైత‌న్న‌ల క‌ష్టానికి ఫ‌లితం ల‌భించేలా చేసింది… వారి మోములో న‌వ్వువిక‌సించేలా చేసింది. ఆయ‌నే పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి. నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్న పాలేరు రిజ‌ర్వాయ‌ర్ ద్వారా కృష్ణా జ‌లాలు ఎప్పుడూ వ‌స్తుంటాయి. సీతారామా ప్రాజెక్టు ఉన్నా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో కొంత ప్రాంతానికి నీళ్లు రాని దుస్థితి. పొలాలు ఎండిపోతోన్న ప‌రిస్థితి. రైతుల బాధ‌లు వ‌ర్ణనాతీతంగా ఉండేవి. ఆ టైంలో కందాళ వ్యూహాత్మ‌కంగా గోదావ‌రి జలాల‌ను పాలేరు జ‌లాల‌తో అనుసంధానం చేసి ఔరా అనిపించారు.

బయ్యారం పెద్ద చెరువు నుంచి వస్తున్న గోదావరి జ‌లాల‌ను అక్కడి నుంచి బయన్నగూడెం వాగులోకి.. గ్రావిటీ ద్వారా ఉర్లు గొండ గ్రామంలోని పాలేరులో కలిసేలా చేశారు. ఇందుకోసం పై స్థాయిలో సీఎం, ఇరిగేష‌న్ ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి ఒత్తిడి చేసి మ‌రీ గోదావ‌రి జ‌లాల‌ను పాలేరుతో అనుసంధానం చేశారు. కృష్ణ పరివాహకంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నా గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఇక్కడి రైతులు రెండు పంట‌లు పండించుకోగ‌లిగారు. ఒక‌ప్పుడు సాగునీటి వసతి లేక మెట్ట పంటలకే పరిమితమైన రైతులు.. కందాళ చొర‌వ‌తో పారుతున్న నీటిలో ఆకుకూరలు, కూరగాయలు, వరి, మిర్చి, పత్తితోపాటు పాటు అన్ని రకాల పంటలు పండిస్తున్నారు.

అంతేకాదు.. ఎమ్మెల్యే కందాళ ముందు చూపు కార‌ణంగా ఏటా రెండు పంటలతో వేల మంది వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుండ‌డం గ‌మ‌నార్హం. ఫ‌లితంగా ఆయా కుటుంబాలు ప్ర‌శాంత జీవ‌నాన్ని గ‌డుపుతున్నారు. ఒక‌ప్పుడు ఇక్క‌డ నుంచి హైద‌రాబాద్‌కు కూలీల వ‌ల‌స ఉండేది. ఇప్పుడు ఇక్క‌డే కావాల్సినంత ప‌నిదొరుకుతోంది.

భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు..

ఒక‌ప్పుడు ఒక పంట పండేందుకు ఇబ్బంది ప‌డే ప‌రిస్థితుల నుంచి యేడాదికి రెండు పంట‌లు పండేలా ఇక్క‌డ భూములు మారిన క్ర‌మంలో పాలేరులో భూముల ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. గ‌త ఐదేళ్ల కింద‌ట ఎకరా భూమి రూ.2-3 లక్షలు ఉండగా, ఈ రోజు ఏకంగా రూ.35-40 లక్షల వరకు ధర పలుకుతోందంటే.. దీనివెనుక ఎమ్మెల్యేగా కందాళ ప‌డిన కృషి, చేసిన సేవ ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.

సాగు నీటి కోసం..

స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర‌మైన స‌మ‌స్య‌.. సాగు నీరు. దీనిని గ‌తంలో గెలిచిన వారు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఫ‌లితంగా వేలాది ఎక‌రాల్లో నాట్లు వేసిన రైత‌న్న చుక్క నీటి కోసం దిక్కులు చూసిన ప‌రిస్థితి ఉంది. కానీ, కందాళ ఎమ్మెల్యే అయ్యాక రూ.335.59 కోట్లతో పాలేరు జలా శయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకంతో 79,500 ఎకరాలకు సాగునీరు అందించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ‘మిషన్ కాకతీయ’ పథకంలో భాగంగా, నియోజకవర్గ వ్యాప్తంగా 120 చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తెచ్చారు.

సీతారామ ప్రాజెక్టు కోసం ఓపెన్ కెనాల్ ద్వారా 600 ఎక‌రాలు పోతుంటే ఎమ్మెల్యే ప‌రిజ్క్షానంతో ట‌న్నెల్ ద్వారా వాట‌ర్ తీసుకురావ‌డం వ‌ల్ల 102 ఎక‌రాలు మాత్ర‌మే పోయి.. 500 ఎక‌రాలు రైతుల‌కు సేవ్ అయ్యింది.

విద్యా నాథుడిగా..

భిన్న కోణాల్లో ఆలోచించే ఎమ్మెల్యే కందాళ‌.. స్థానికంగా ఉన్నత విద్యను అమితంగా ప్రోత్స‌హించారు. దీనిలో భాగంగా కూసుమంచి, తిరుమలాయ పాలెం, ఖమ్మం రూరల్ పరిధిలో కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా విద్యాలయాల్లో ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులు ఉన్నత చ‌దువులు చ‌దువుతున్నారు. 1,100 మంది బాలికలు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జేఎన్‌టీయూ ఇంజ‌నీరింగ్ కాలేజ్ కోసం జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేల‌తో పోటీప‌డి వారిని ఒప్పించి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చేలా చ‌క్రం తిప్పారు. అలాగే న‌ర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాట‌య్యేలా చేశారు.

తొలి విడత ‘మన ఊరు- మన బడి’ కింద 75 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో ఇప్పటికే 90 శాతం పనులు పూర్త య్యాయి. ఒక్కో పాఠశాల కార్పొరేట్ స్థాయిలో వసతులు సమకూర్చుకుంటోంది.

ఖమ్మం మిషన్‌కు ప్రాధాన్యం..

ఉమ్మ‌డి ఖ‌మ్మ జిల్లాలో 2 ల‌క్ష‌ల 75 వేల‌, 354 ఇళ్ల‌కు మిషన్. నీరు అందుతోంది. పాలేరులోని మత్స్య పరి శోధన కేంద్రం మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు కోసం పరిశోధనలు జ‌రుగుతున్నాయి.

ప‌రిశోధ‌న‌ల‌కు పెద్ద‌పీట‌

పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూసుమంచి మండలం ఝల్రావుపేట పరిధిలోని మల్లాయిగూడెం రహదారి పక్కన 10 ఎకరాల్లో మత్స్య కాలేజీ నిర్మించనున్నది. తద్వారా వందలాది మంది విద్యార్థులు ఫిష రీస్ కోర్సు చదువనున్నారు. దీనివెనుక ఎమ్మెల్యే కందాళ కృషి ఎంతో ఉంది.

నియోజ‌వ‌క‌ర్గంపై క‌న‌క వ‌ర్షం

ఎమ్మెల్యే కందాళ గ‌త నాలుగేళ్ల‌లో త‌న నియోజ‌క‌వ‌ర్గం పాలేరుపై.. క‌న‌క వ‌ర్షం కురిపించార‌ని కింది లెక్క‌లే చెపుతున్నాయి.

  • పాలేరు నియోజకవర్గానికి 335.59 కోట్ల రూపాయ‌ల‌తో శ్రీరామ ఎత్తిపోతల పథకం తెచ్చారు.
  • కల్యాణలక్ష్మి తో 2,325 మందికి రూ.23.27 కోట్ల లబ్ధి
  • రూ.64.50 కోట్ల వ్య‌యంతో 141 గ్రామాల్లో వైకుంఠ‌ధామాలు.ఏర్పాటు
  • 1,235 మందికి రూ.61.75 కోట్ల మేర‌కు రైతు బీమా అందించారు
  • 100 ఎస్సీ కుటుంబాల‌కు 100 యూనిట్లు మంజూరు
  • రూ. 6 కోట్ల నిధులతో 29 రైతు వేదిక‌ల నిర్మాణం
  • రూ.250 కోట్లతో చెరువుల బలోపేతానికి చ‌ర్య‌లు
  • పాలేరు పాత కాలువ ఆధునీకరణ
  • గ్రామాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ. 26 కోట్లు వెచ్చించారు.
  • క‌రోనా టైంలో రు. 50 ల‌క్ష‌లు వెచ్చించి నియోజ‌క‌వ‌ర్గం మొత్తం హోమియోప‌తి మందులు ప్ర‌తి ఒక్క‌రికి పంపిణీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version