నాయకులు ఎందరో ఉంటారు. ఎంతో మంది పోటీచేస్తారు. కానీ, ప్రజల పక్షాన గళం విప్పేవారు. ముఖ్యంగా అణగారిన వర్గాల పక్షాన మాట్లాడేవారు చాలా చాలా తక్కువ మందే ఉంటారు. ఉన్నారు కూడా. అంతేకాదు.. దళిత ఎమ్మెల్యేలు కూడా తమ సామాజిక వర్గాలకు ఎంత మేలు చేశారంటే.. తడిమి చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు సర్వత్రా కనిపిస్తోంది. అయితే.. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న కందాళ ఉపేందర్ రెడ్డి మాత్రం.. తాను అగ్రవర్ణమే అయినప్పటికీ…. దళితుల సంక్షేమాన్ని ఆయన కలలు గంటున్నారు.
సమాజంలో అణిచివేతకు గురవుతున్న దళితులకు ఉన్నత అవకాశాలు కల్పించడం.. విద్యను అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను చేరువ చేయాలనే తలంపుతో అహరహం శ్రమిస్తున్నారు. తెలంగాణలో హాట్ టాపిక్‌గా , అత్యంత కీలకమైన పథకంగా ఉన్నదళిత బంధు విషయంలోనూ కందాళ ఆలోచనలు ఇలానే ఉన్నాయి. దళితుల జీవన ప్రమాణాలు మార్చేసే అత్యద్భుత పథకం ఇది.
కందాళ మాత్రం.. దళిత బంధుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేదికపైనే ఆయన ఈ విషయం గురించి ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ నియోజకవర్గంలో గెలిచి మీకు గిఫ్ట్‌గా అందిస్తానని.. దీనికి ప్రతిగా.. తనకు దళిత బంధును నియోజకవర్గంలోని అర్హులైన దళితులు అందరికీ అమలు చేసేలా.. వరం ఇవ్వాలని కోరారు. దీనికి కేసీఆర్ కూడా జై కొట్టారు. అంటే.. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా కోరని వరాన్ని అడిగి..పాలేరులోని దళితులకు ఇచ్చే ప్రయత్నం చేశారు.
కందాళ గెలిపించుకోవాల్సిన అవసరం..!
తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కందాళ ఉపేందర్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం అన్నివర్గాలపై నా ఉంది. ముఖ్యంగా దళిత బంధు కోసం ఎదురు చూస్తున్న సామాజిక వర్గాలు.. ఆయనను గెలిపించుకు ని తీరాల్సిన అవసపరం ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో బీఆర్ ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చినా.. పాలేరులో కందాళ కనుక ఓడిపోతే.. దళిత బంధు ప్రస్తావన కానీ.. దీని గురించి అడిగేవారు కానీ ఏ ఒక్కరూ ఉండరు.
ఇక్కడ కనుక కందాళ గెలిస్తే.. బహిరంగ వేదికపై.. సీఎం కేసీఆర్ నుంచి వరం పొందిన నేపథ్యంలో దళిత బంధును తీసుకువచ్చే బాధ్యతను, స్థానికంగా ఉన్న దళితుల్లో అర్హులైన వారికి రూ.10 లక్షలు చొప్పున ఇప్పించే బాధ్యతను ఆయన తీసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ సీఎం కేసీఆర్ బహిరంగంగా మాట ఇస్తే తప్పరు. అందుకే ఇప్పుడు నియోజకవర్గలోని దళితుల్లో ఇదే విషయం ప్రధాన చర్చగా మారింది. వారంతా కందాళ గెలుపు.. దళితులకు మేలు మలుపు! అని సూచిస్తున్నారు.