చంద్రబాబుకు బిగ్ షాక్.. మరో టీడీపీ ఎమ్మెల్యే జంప్?

-

ఆహా.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్యమైన నేతలు వైసీపీలో చేరి చంద్రబాబుకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా టీడీపీని వీడటానికి సిద్ధంగా ఉన్నాడట. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు బాబురావుకు టికెట్ కేటాయించకపోవచ్చని తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీని వీడనున్నట్లు సమాచారం. కదిరి బాబురావు.. బాలకృష్ణకు సన్నిహితుడు. గత ఎన్నికల్లో కనిగిరి నుంచి టికెట్ దక్కించుకొని విజయం సాధించాడు. ఈసారి మాత్రం కనిగిరి టికెట్ ఉగ్రనరసింహరెడ్డికి చంద్రబాబు ఇవ్వనున్నాడట. దీంతో బాబురావుకు ఈసారి కనిగిరి టికెట్ కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో బాబురావు.. వేరే పార్టీలోకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నాడట. అయితే.. బాబురావు టీడీపీని వీడి.. ఏ పార్టీలో చేరుతాడు అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

 అంతటా జగన్‌కే అనుకూలం

Read more RELATED
Recommended to you

Exit mobile version