మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయాన బాబాయ్ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు హత్యకు గురైన విషయం తెలిసిందే.తాజాగా వివేకా హత్యపై ప్రస్తుతం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘నేను కూడా వివేకానంద రెడ్డిది గుండెపోటు మరణం అనే అనుకున్నాను. ఆయన కూతురు సునీత పోస్టుమార్టం అడగకపోతే వివేకా అంత్యక్రియలు జరిపించేసి ఉండేవాళ్లు.
నేరాలు-ఘోరాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.సంచలన కేసు వచ్చినప్పుడు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు’ అని సీఎం చంద్రబాబు వ్యాక్యానించారు. కాగా, వైఎస్ వివేకాను ఎన్నికల ముందు జగన్ చంపించారని ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు సైతం అదే నిజమని ఆరోపిస్తున్నారు.