ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే అనేక సర్వేలు తేల్చేశాయి. వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పేసాయి. మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తిరిగి జగనే సీఎం అవుతారని ఆయన కరాఖండీగా చెప్పేశారు.ఓ ప్రముఖ వార్త ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందoటూ తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయము అని దానిపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఏపీ రాజకీయాలపై ఆయన కామెంట్లు చేశారు.
మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇస్తూ.. తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో తిరిగి జగన్ అధికారం చేపడతారని ఆయన తెలిపారు.ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్‌ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.అయితే వారి ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు.ఇక ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్ రెడ్డి తనపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని..తాను మరోసారి సీఎంగా పని చేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు.
తన కూతురు , ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై కూడా కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనవసరంగా అమాయకులను శిక్షిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, ఇదింతా కూడా ప్రధాని మోదీ సృష్టేనని కేసీఆర్ అన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. తన కూతురు కవితకు ఏమి తెలియదని, లిక్కర్ స్కామ్‌తో కవితకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో తన కూతురు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.అయితే దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు.