రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి ని .. తాను సైలెంట్ గా ఉంటూ భలే ఇరికించిన కే‌సి‌ఆర్ !

-

తెలంగాణ రాజకీయాలలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా దూసుకుపోతున్న కేసీఆర్ ని భయంకరంగా విమర్శలు చేసిన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి ‘ఓటుకు నోటు కేసు’ లో దొరికిన తర్వాత చాలావరకు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మళ్లీ కేసీఆర్ ని  టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మల్కాజిగిరి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు కేసీఆర్ ని విమర్శలు చేస్తూ రెచ్చిపోయారు.

అయితే ఇటీవల తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధించడంతో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల నాయకుల నోళ్లు మూసుకుపోయాయి. ఇటువంటి తరుణంలో ఎప్పటినుండో తనపై రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి ని… తాను సైలెంట్ గా ఉంటూ కే‌సి‌ఆర్ భలే ఇరికించినట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే  రేవంత్ రెడ్డి భూదందా కేసులో దొరికిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ కేసులో ఒక డిప్యూటి కలెక్టర్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

 

హైదరాబాద్ శివారులోని గోపన్నపల్లి వద్ద రేవంత్ రెడ్డి సోదరుల పేరుతో ఆరు ఎకరాలకుపైగా స్థలాన్ని డిప్యూటి కలెక్టర్ అక్రమంగా మ్యుటేషన్ చేశారన్నది అబియోగంగా ఉంది. ఈ భూమి హక్కుదారులుగా నకిలీ వ్యక్తులను సృష్టించి ఆ తర్వాత వీరు కొనుగోలు చేశారని ప్రభుత్వ విచారణ లో వెల్లడైందని కథనాలు వస్తున్నాయి. దీంతో ఆ భూమికి సంబంధించిన బాధితులు కోర్టును ఆశ్రయించినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దీనిపై విచారణ చేయించగా రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా ఈ భూ దందాలో భాగస్వామి అయినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించినట్లు వార్తలు వినపడుతున్నాయి. దీంతో ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version