రేవంత్ రెడ్డిని హైలైట్ చేస్తున్న కేసీఆర్…నెగిటివ్ అవుతుందా?

-

టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి revanth reddy  రాజకీయాలు మామూలుగా ఉండటం లేదు. రాష్ట్రంలో దూకుడుగా ముందుకెళుతూ, కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ విరుచుకుపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఊహించని విధంగా విమర్శలు చేస్తూ ముందుకెళుతున్నారు. అయితే రేవంత్‌కు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో కేసీఆర్ ప్రభుత్వం, ఆయన్ని మరింత హైలైట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

గతంలో సాధారణ నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డిని పలుమార్లు జైల్లో పెట్టడం, ఆయన మీద అనేక కేసులు పెట్టి మరీ కేసీఆర్ ప్రభుత్వం హైలైట్ చేసింది. ఆయన పీసీసీ స్థాయి వరకు ఎదగడానికి పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వమే సాయం చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్‌ని మరింత హైలైట్ చేసే పనిలో పడింది కేసీఆర్ ప్రభుత్వం.

తాజాగా రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల విషయంలో కూడా రేవంత్, ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కోకాపేటలో జరిగిన భూముల వేలంలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు.

అయితే భూముల వేలంలో కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులే తక్కువ ధరకు భూములు కొనుక్కున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలని కూడా బయటపెడతానని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ కోకాపేట భూముల సందర్శనకు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీతో కలిసి వెళ్లడానికి సిద్ధమైన నేపథ్యంలో, రేవంత్‌ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇలా రేవంత్‌ని అడ్డుకుని కేసీఆర్ ప్రభుత్వం, ఆయన చేసిన ఆరోపణల్లో నిజం ఉందనుకునేలాగా చేసుకుంటుందని, దీని వల్ల ప్రభుత్వానికి నెగిటివ్ అవ్వడమే కాకుండా, రేవంత్ హైలైట్ అవుతున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version