రేవంత్ రెడ్డికు దేవేందర్ గౌడ్ ఫ్యామిలీ షాక్ ఇస్తుందా?

-

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సైతం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఘర్ వాపసీ పేరుతో ఇప్పటికే తమ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిన నాయకుల్ని, తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, వేరే పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని సైతం కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ తనయుడు డి. సంజయ్‌ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంజయ్ సైతం కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధమయ్యారు. అటు టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న శ్రీనివాస్ సైతం, తిరిగి సొంత గూటికి చేరుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అలాగే సీనియర్ నేతలు ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణలు సైతం కాంగ్రెస్‌లోకి రానున్నారని తెలుస్తోంది.

అయితే ఏళ్ల తరబడి తెలంగాణ టీడీపీలో కీలకంగా పనిచేసిన దేవేందర్ గౌడ్ ఫ్యామిలీని సైతం రేవంత్ రెడ్డి కలిశారు. ఇప్పటికే ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ బీజేపీలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక అనారోగ్య కారణాలతో దేవేందర్ గౌడ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు. కానీ ఆయన మాత్రం ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే దేవేందర్ గౌడ్‌కు రంగారెడ్డి జిల్లాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. దీంతో ఆయన ఫ్యామిలీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

రేవంత్, వీరేందర్‌గౌడ్‌ను కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించినట్లు తెలిసింది. బీజేపీలో ఆశించిన పదవి దక్కక వీరేందర్‌గౌడ్‌ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ ఫ్యామిలీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరు వేరు అని వీరేందర్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతారనే అంశంపై క్లారిటీ లేదు. అయితే రేవంత్ రెడ్డితో వీరేందర్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి రేవంత్‌ని చూసి వీరేందర్ కాంగ్రెస్‌లోకి వస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version