రమణతో కేసీఆర్ కొత్త వ్యూహం…వర్కౌట్ అవుతుందా?

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి దాదాపు ఖతం అయిపోయినట్లే అని చెప్పొచ్చు. ఇక ఆ పార్టీని మరింత కోలుకొనివ్వకుండా చేయడానికి ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణని కేసీఆర్, టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు. అయితే ఈయనని తీసుకోవడం ద్వారా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ లబ్ది పొందడమే కేసీఆర్ వ్యూహామని అంతా అనుకున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్

పైగా రమణకు సీటు ఇచ్చే ఛాన్స్ ఉందని లేదా ఎమ్మెల్సీ అయినా ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్, రమణని తీసుకున్న అసలు ఉద్దేశం వేరు అని తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే…వచ్చే ఎన్నికల్లో కవిత గెలుపు కోసం రమణని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల అనే సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఈయన జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం కూడా వహించారు.

అయితే అదే జగిత్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో కవిత బరిలో ఉంటారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో సంజయ్ గెలుపు కోసం కవిత ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని జగిత్యాల బరిలో ఓడించడంలో కవిత కీలక పాత్ర పోషించారు.

అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కవిత, నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కవిత గెలుపు కోసం కేసీఆర్, సీనియర్ నేతలు సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావులని పార్టీలోకి తీసుకొచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఈ సారి కవితని జగిత్యాల బరిలో నిలబెట్టి గెలిపించుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ నియోజకవర్గంపై పట్టు ఉన్న రమణని టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్.  మరి ఈసారి కేసీఆర్ వ్యూహం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version