కేసీఆర్.. దేశానికి ఆదర్శం, దిక్సూచి : ఆర్ నారాయణ మూర్తి పొగడ్తలు

-

మరోసారి ఆర్.నారాయణమూర్తి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రైతుబంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని… ఆయన లాంటి లీడర్‌ ఎక్కడా లేరని కొనియడారు. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని…ఈ నెల 14న 37వ సినిమా రైతన్న విడుదలవుతుంది.. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, కరంటు చట్టాలు రైతులకు వరాలు కావు, శాపాలు అని మండిపడ్డారు. ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారని.. కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే ధైర్యంగా వ్యవసాయం చేసి ఆహారం అందించింది రైతాంగం అని తెలియజేశారు. ఇలాంటి చట్టాలు వర్ధమాన దేశమైన భారతదేశానికి మంచివి కావని..స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదన్నారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version