వ‌ల‌స‌ల‌ను కేసీఆర్ ఆప‌లేక పోతున్నారా….?

-

బిఆర్ఎస్‌ అధికారంలో ఉన్న ప‌దేళ్ళ కాలంలో తెలంగాణ‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్ కిట‌కిట‌లాడేది.టిఆర్ెస్ నుంచి బిఆర్ ఎస్‌గా పేరు మార్చుకునే వ‌ర‌కు ఈ ప‌రిస్థితి క‌నిపించింది. ఒక‌ప్పుడు ఇబ్బ‌డిముబ్బ‌డిగా బిఆర్ ఎస్‌లోకి వ‌చ్చిన నేత‌లు ఇప్పుడు ఆ పార్టీలో ఉండ‌లేక జారుకుంటున్నారు. క‌ట్ట‌లు తెగిన‌ట్లుగా ఒక‌రి త‌రువాత ఒక‌రు బ‌య‌టికి వ‌చ్చేస్తున్నారు.దిగువ‌స్థాయి మొద‌లుకుని మంత్రులుగా పని చేసిన వారు కూడా ఇప్పుడు దారులు వెతుక్కుంటున్నారు.ఓ వైపు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా వ‌ల‌స‌ల‌ను ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు బిఆర్ స్‌.చెప్పినా వినే పరిస్థితిలేదని.., బుజ్జగించే ప్రయత్నం చేసి విలువను తగ్గించుకోవడం ఎందుుకన్నట్లుగా కెసిఆర్‌,కెటిఆర్ ఇద్ద‌రూ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చ‌ర్చలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర‌వ్యాపప్తంగా న‌డుస్తున్నాయి.

పెద్ద‌ప‌ల్లి,క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా మాజీముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికీ తగ్గలేదని తాజాగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. లీడర్లు పోయినా క్యాడర్ ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నారు. అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు అటూఇటూ పోవచ్చు. క్యాడర్‌ మాత్రం అలాగే ఉంటుంది. ఆ క్యాడర్‌ను కాపాడుకోవాలని సమీక్షల్లో చెబుతున్నారు. కానీ ద్వితీయ శ్రేణి క్యాడర్ వలసే ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ పార్టీని స్వతహాగా బలపర్చుకునే ప్రయత్నం చేయకపోగా.. అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధానం వల్ల.. ఎక్కువ మంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు.దీంతో అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు పెరిగాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఇదిలా ఉండ‌గా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే రెండు లోక్ సభ స్థానాల‌కు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని ప్రకటించారు.పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అస‌లు పోటీ చేయ‌డంలేద‌నే రూమ‌ర్‌ల‌కు కేసీఆర్ చెక్ పెట్టిన‌ట్ల‌యింది. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తఉన్నామ‌ని అన్ని స్థానాల‌లో అభ్య‌ర్ధుల‌ను నిల‌బెడ‌తామ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కెసిఆర్ చెప్తున్నా సీనియర్ నేతలు మాత్రం పోటీకి వెనుకాడుతున్నారు.బీజేపీ ప్ర‌క‌టించిన తొలి జాబితాలో ఎక్కువ మంది బిఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారే ఉండ‌టం గ‌మ‌నార్హం.తాజాగా వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. వరంగల్ కీలక నేతలంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. మేయర్ గుండు సుధారాణి కూడా ఈ జాబితాలో ఉన్నారు. పెద్ద నేతల కన్నా స్థానిక నేతల వలస ఎక్కువగా ఉండటం బీఆర్ఎస్ ను బాగా ఇబ్బంది పెడుతోంది.ఈ వ‌ల‌స‌ల‌కు అడ్డుక‌ట్ట వేస్తే కానీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాల‌ను బిఆర్ఎస్ గెల‌వ‌లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version