పంజాబ్‌ పేరుతో గేమ్..కేసీఆర్ అట్టర్‌ఫ్లాప్ షో..

-

ఏదేమైనా హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు మార్చారనే చెప్పాలి. అసలు హుజూరాబాద్‌ ఓటమి ప్రభావం పడకుండా కేసీఆర్ బాగా ట్రై చేశారు. ఆ ఓటమిని డైవర్ట్ చేయడానికి తనదైన శైలిలో స్ట్రాటజీలు మారుస్తూ వచ్చారు. పైగా ఈటల రాజేందర్‌ని హైలైట్ అవ్వనివ్వకుండా, బండి సంజయ్‌ని టార్గెట్ చేసి…ఆయన చుట్టూ రాజకీయం చేశారు. స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి బండిపై విరుచుకుపడుతూ వచ్చారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డిని కూడా సైడ్ చేస్తూ…కేవలం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు వార్ మార్చారు.

kcr

ఇతర సమస్యలు కనిపించకుండా కేవలం ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి…అందులో రాజకీయంగా లబ్ది పొందడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అసలు కేంద్రం వడ్లు కొంటుందా లేదా అంటూ తాను బ్యాన్ చేసిన ధర్నా చౌక్‌లో రెండు గంటల పాటు ధర్నా చేశారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత నుంచి కేసీఆర్ ఏదో రాజకీయంగా చేసేస్తున్నానని అనుకుంటూ వస్తున్నారు…కానీ ఆయన రాజకీయం మొత్తం రివర్స్ అయ్యి…టీఆర్ఎస్‌కే డ్యామేజ్ జరుగుతుందనే విషయం ఆయనకు అర్ధం కావడం లేదు.

అసలు వానాకాలం వడ్లు కొనడానికి కేంద్రం సిద్ధంగానే ఉంది…అది వదిలేసి…యాసంగి వడ్లని కొంటారా లేదా? హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే పారా బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చెప్పేసింది. అది గతంలోనే కేసీఆర్‌కు కూడా చెప్పింది. కేసీఆర్ కూడా దానికి అంగీకరించారు. అసలు వరి వేయొద్దని రైతులకు చెప్పేశారు. కానీ హుజూరాబాద్ తర్వాత కేసీఆర్‌పై పోరాటం మొదలుపెట్టారు. పంజాబ్‌లో కొన్నట్లు ఇక్కడ కూడా ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే కేసీఆర్ పంజాబ్ పేరు చెప్పి బీజేపీని ఇరికించాలని చూస్తున్నారు…కానీ అందులో కేసీఆరే ఇరుక్కుంటున్నారు. ఎందుకంటే పంజాబ్‌లో వానాకాలం వరి, వేసవి కాలం పూర్తిగా గోధుమలు పండిస్తారు. అందుకే అక్కడ వరిని కేంద్రం ఒకేసారి కొంటుంది. అందులోనూ పంజాబ్ నుంచి స్టీమ్ రైస్ వెళుతుంది. కానీ ఆ లాజిక్‌లు వదిలేసి…ఇప్పుడు వానాకాలం పంటని గాలికొదిలేసి..యాసంగి ధాన్యాన్ని కొంటారా లేదా అంటూ కేసీఆర్ చేస్తున్న హడావిడి చూస్తుంటే పక్కాగా రాజకీయం చేస్తున్నారని అర్ధమవుతుంది. ముందు కల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేసి రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌ది..అది వదిలేసి కేంద్రాన్ని టార్గెట్ చేస్తే ఉపయోగం లేదు. మొత్తానికైతే ధాన్యం అంశంలో కేసీఆర్ రాజకీయం అట్టర్ ఫ్లాప్ షో అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version