బెజవాడలో సైకిల్‌కి సెగలు..కేశినేని దెబ్బ అదురుతుందా?

-

బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి..మామూలుగానే అక్కడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి.ప్రధాన పార్టీల మధ్య పోరు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒకే పార్టీలో రచ్చ నడుస్తుంది. ఎప్పటినుంచో విజయవాడ టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని..అక్కడే ఉన్న టి‌డి‌పి నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, నాగుల్ మీరా లాంటి వారి మధ్య పోరు నడుస్తుంది. కేశినేని టార్గెట్ గా ఆ నేతలు రాజకీయం నడిపిస్తున్నారు.

కేశినేనికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో కేశినేని కూడా రివర్స్ అవుతున్నారు. ఆ నాయకులకు ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ నేతలతో కలిసి ముందుకెళుతున్నారు. ఇటీవల మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావులతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈయన ఎంపీగా ఉంటూ..అలా పనులు చేయడం ఇబ్బంది లేదు గాని..అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారని చెప్పడం ఆ స్థానాల్లో ఉండే టి‌డి‌పి నేతలకు మింగుడు పడటం లేదు.

మైలవరంలో దేవినేని ఉమా, నందిగామలో తంగిరాల సౌమ్యలకు నాని వ్యవహారం ఇబ్బందిగా మారింది. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధిలో నానికి చెక్ పెట్టే విధంగా ఆయన తమ్ముడు చిన్నిని తీసుకొచ్చారు. చిన్ని పార్లమెంట్ పరిధిలో పనిచేస్తున్నారు. దీంతో విజయవాడ టీడీపీ పార్లమెంట్‌ టికెట్‌ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానేమో అని అన్నారు.

దీంతో కేశినేనికి విజయవాడ సీటు ఇవ్వట్లేదని తెలుస్తుంది. ఇదే సమయంలో కేశినేని టి‌డి‌పిని వదిలేస్తారనే ప్రచారం వస్తుంది. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? లేక వైసీపీలోకి వెళ్తారా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా గాని నాని ఇలాగే ముందుకెళితే బెజవాడ పరిధిలో టి‌డి‌పికి మాత్రం నష్టమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version