ఆ మూడు సీట్లపై ఉత్కంఠ..కారుకు ధీటుగా కాంగ్రెస్.!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు సీట్లపై ఉత్కంఠ నెలకొంది..ఆయా సీట్లలో బి‌ఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరు బరిలో దిగుతారనే చర్చ ఎక్కువ నడుస్తోంది. పైగా ఆ మూడు జనరల్ సీట్లకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మంలో 10 సీట్లు ఉంటే అందులో 7 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లు కాగా, మూడు మాత్రమే జనరల్ సీట్లు. అవి వచ్చి పాలేరు, కొత్తగూడెం, ఖమ్మం సీట్లు.

ఈ మూడు సీట్లలో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరి వీరికి పోటీగా కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మూడు సీట్లకు పొంగులేటి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మూడు సీట్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా పొంగులేటికి ఒక్క సీటులోనే పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆ సీటు ఏంటి అనేది క్లారిటీ లేదు.

ఇక్కడ చాలా సమీకరణాలు ఉన్నాయి. పాలేరులో షర్మిల పోటీ చేస్తానని అన్నారు. ఆమె పార్టీ…కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. అదే జరిగితే పాలేరు సీటు ఆమెకు ఇవ్వాలి. అదే సమయంలో బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కని తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తే పాలేరు ఇవ్వాల్సిందే. ఇక పొంగులేటి ఏ సీటులో పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఆయనకు మూడు సీట్లలో పట్టు ఉంది.

అలా అని మూడు సీట్లు ఇవ్వరు..కాబట్టి ఒకటే దక్కుతుంది. ఆ సీటు ఏంటి అనేది క్లారిటీ లేదు. చూడాలి మరి ఈ మూడు సీట్లలో కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version