తిరువూరు వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

-

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైసిపిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పురపాలక సంఘం సమావేశం సందర్భంగా మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. తిరువూరు పురపాలక సంఘం సమావేశానికి అధికార పార్టీకి చెందిన 17 మంది వైకాపా సభ్యులకు 16 మంది గైర్హాజరు అయ్యారు. మున్సిపల్ ఛైర్మన్ పర్సన్ గత్తం కస్తూరిభాయి ఏకాకి అయ్యారు. టిడిపికి చెందిన ముగ్గురు సభ్యులు హాజరయ్యారు.

కోరం పూర్తి కాకపోవడంతో సమావేశం వాయిదా వేశారు ఛైర్పర్సన్. మున్సిపల్ ఛైర్మన్ పదవి రెండేళ్ల ఒప్పందం అమలు చేయాలని ఇటీవల ఛైర్పర్సన్ పై తిరుగుబావుటా ఎగురవేశారు అసమ్మతి వర్గం సభ్యులు. దీంతో అధికార పార్టీ సభ్యుల తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెదేపా సభ్యులు. తిరువూరు పట్టణంలో అభివృద్ధి విస్మరించి అధికార పార్టీ సభ్యులు కుర్చీ కోసమే కొట్లాడుకుంటున్నారని మండిపడ్డారు తెదేపా సభ్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version