ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ని ఆ పదవి నుంచి తప్పించనున్నారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుత అధ్యక్షురాలు పురందరేశ్వరి ఆశించిన మేర క్రియాశీలకంగా లేదని భావించిన హైకమాండ్ ఏపీ బీజేపీ చీఫ్‌ని మార్చే ఆలోచన చేస్తోంది. ఆమెను తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడుగా నియమించాలని అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది .
ఇప్పటికే దక్షిణాదిపై గురి పెట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ,రాజకీయ పరిణామాల దృష్ట్యా, ఆయన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి మరింత మేలు చేకూరుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.అందులో భాగంగా బీజేపీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే త్వరలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టి ప్రక్షాళన చేసేలా అడుగులు వేస్తూన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ, వైసీపీలోని అసంతృప్త నేతలు మొత్తం బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని అధినాయకత్వం భావిస్తోంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే బీజేపీకి ఆశించిన మేర ఫలితాలు రాబట్టవచ్చని కమలనాథులు ఆలోచిస్తున్నారు.
పురంధేశ్వరిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. రాజకీయంగా సీనియర్ నేతగా ఉన్న పురందరేశ్వరి పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడంలో విఫలమయ్యారు.ఈ విషయంతో సొంత పార్టీ నేతలే ఆమె వైఖరిని అంతర్గతంగా ఖండిస్తున్నారు.అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, టీడీపీ తప్పులను ఎత్తి చూపడంలోనూ ఆమె విఫలమయ్యారని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పార్టీలో సీనియర్లుగా ఉన్న జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, సత్య కుమార్ తోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపు పోవడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
పైగా ఇటీవల జిల్లాల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాలో ఉన్న సీనియర్లకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు.ఇవన్నీ పక్కన పెడితే టీడీపీతో సమదూరం పాటిస్తున్న బీజేపీ…,అదే సమయంలో టీడీపీ నుంచి చేరికల విషయంలో ఆసక్తి చూపడం లేదని ఆరోపణలున్నాయి.ఇలా పార్టీకి ప్రయోజనం లేని కార్యక్రమాలు నిర్వహించడమే ఆమెకు శాపంగా మారనున్నాయని పార్టీలోని సీనియర్ వర్గం చెబుతోంది.మరో నెలరోజుల్లో