కిషన్ రెడ్డి ఈజ్ బ్యాక్?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఉమ్మడి ఏపీ రాజకీయాలో కీలక నేతగా ఎదిగి…బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదుగుతూ వచ్చిన కిషన్ రెడ్డి పోలిటికల్ కెరీర్ లో ఫెయిల్యూర్ ఏదైనా ఉందంటే అది 2018 ఎన్నికల్లో ఓటమి..2004లో హిమాయత్ నగర్ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి..2009లో అంబర్ పేట నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 2014లో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఇలా హ్యాట్రిక్ కొట్టి తిరుగులేని నేతగా ఉన్నా కిషన్ రెడ్డికి ఊహించని విధంగా 2018లో పరాభవం ఎదురైంది.

కేవలం స్వల్ప మెజారిటీ తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి కాలేరు వెంకటేష్ చేతిలో ఓడిపోయారు. ఇలా తొలిసారి ఓటమి వచ్చిన వెనుదిరగకుండా…2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి…కేంద్ర సహాయ మంత్రిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఇలా బీజేపీలో అగ్రనాయకుల్లో ఒకరిగా ఉన్నా కిషన్ రెడ్డి…నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో మరోసారి అంబర్ పేట బరిలో దిగడానికి కిషన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓడిన చోటే గెలిచి చూపించాలని కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే అంబర్ పేటలో కిషన్ రెడ్డి బలం పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో అంబర్ పేట సీటు బీజేపీ గెలుస్తుందని తేలిన విషయం తెలిసిందే.

ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అసాధ్యమని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏదో కేసీఆర్ గాలి…తెలంగాణ సెంటిమెంట్ తో కాలేరు వెంకటేష్ విజయం సాధించేశారు. కానీ ఈ సారి మాత్రం అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు…ఈ సారి పక్కాగా కిషన్ రెడ్డి…అంబర్ పేటలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి…ఏదేమైనా కిషన్ రెడ్డి ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version