కాంగ్రెస్‌లో కొండా సురేఖ ట్విస్ట్‌లు…హుజూరాబాద్‌ బరిలో దిగేది అందుకేనా?

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీల అభ్యర్ధులు ఖరారైపోయిన విషయం తెలిసిందే. బీజేపీ తరుపున ఈటల రాజేందర్ మొదట నుంచి దూకుడుగా హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ సైతం మొన్నటివరకు తామ నాయకులతో ప్రచారం చేయించి, ఇటీవలే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని బరిలో నిలబెట్టారు. దీంతో హుజూరాబాద్ పోరులో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.

konda surekha is huzurabad congress candidate

కానీ ఇక్కడ కాంగ్రెస్ చాలా సైలెంట్‌గా ఉంది. ఇంకా ఆ పార్టీ తరుపున అభ్యర్ధిని ప్రకటించలేదు. అయితే ఇటీవల హుజూరాబాద్‌లో కొండా సురేఖ బరిలో దిగనున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రేపో, మాపో కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కొండా సురేఖ బరిలో దిగడమైతే గ్యారెంటీ అని, అదే సమయంలో తన డిమాండ్లకు ఒప్పుకుంటేనే పోటీ చేస్తానని సురేఖ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.

అసలు సురేఖ డిమాండ్లు ఏంటంటే…వచ్చే ఎన్నికల్లో వరంగల్ అర్బన్, పరకాల, భూపాలపల్లి టికెట్లని తనకు చెప్పినవారికే ఇవ్వాలని, అలాగే నెక్స్ట్ కూడా హుజూరాబాద్ టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక సురేఖ డిమాండ్లకు కాంగ్రెస్ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. కాకపోతే భూపాలపల్లి టికెట్ విషయంలో మినహాయింపు కోరినట్లు సమాచారం. అక్కడ గండ్ర సత్యనారాయణకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది గాకుండా మిగిలిన డిమాండ్లకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సురేఖ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇప్పుడు హుజూరాబాద్‌లో గెలిచే సీన్ లేదు కాబట్టే, సురేఖ ఆ డిమాండ్లని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. అయితే సురేఖని బరిలోకి దించితేనే టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందని పీసీసీ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి హుజూరాబాద్ పోరులో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version