కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు..!

-

మహబూబాద్ జిల్లా : జన ఆశీర్వాద యాత్ర లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఊహించని షాక్‌ తగిలింది. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రానికి జన ఆశీర్వాద యాత్ర కు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొందరు టీఆర్‌ఎస్‌ మండల స్థాయి నాయకులు అడ్డుకున్నారు.

ఇందులో నిరసన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ వెంకట్ మరియు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యం లో జరిగింది. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేయాలని ఈ సందర్భంగా డిమాండు చేశారు. “ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్….కిషన్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు టిఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు. దీంతో జన ఆశీర్వాద యాత్ర లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… నిరసనకు దిగిన టిఆర్ఎస్, దళిత సంఘాల నాయకులను అరెస్ట్‌ చేసి.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version