సంచ‌ల‌న విమ‌ర్శ‌లు.. వైసీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే

-

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ రాజ‌కీయాలు వేడెక్కాయి. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిపై వెంక‌టాచ‌లం ఎంపీడీవో స‌ర‌ళ ఫిర్యాదు చేయ‌డం, ఆ వెంట‌నే ఆయ‌న‌ను అరెస్టు చేయాలంటూ.. సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ నుంచే ఆదేశాలు రావ‌డం, ఆదివారం తెల్ల‌వారు జామున పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేయ డం వంటి ప‌రిణామాలు రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే, అరెస్టు సంద‌ర్భంగా కోటంరెడ్డి సం చల‌న కామెంట్లు చేశారు. త‌న అరెస్టు వెనుక చాలా వ్యూహం ఉంద‌ని, ఎమ్మెల్యే హ‌స్తం ఉంద‌ని వ్యాఖ్యానిం చారు. అదేస‌మ‌యంలో త‌న‌కు, ఎంపీడీవో వివాదానికి కూడా సంబంధం లేద‌ని చెప్పారు.

లేఅవుట్‌కు నీటి సరఫరా కోసం మూడు నెలలుగా ఎంపీడీవో చుట్టూ తిరుగుతున్నామని కోటంరెడ్డి చెప్పారు. కనెక్షన్ ఇవ్వాలని పదేపదే తానుకోరానన్నారు. ఎంపీడీవోకు తాను ఫోన్ చేసింది నిజమేనని… నీటి సరఫరా కు అనుమతి ఇవ్వాలని కోరగా… ఎమ్మెల్యే గారే (కాకాణి గోవర్ధన్ రెడ్డి) వద్దన్నారు అని ఆమె చెప్పిన‌ట్టు కోటం రెడ్డి వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ఎంపీడీవోతో మాట్లాడిన తర్వాత నేరుగా కాకాణికి ఫోన్ చేశానని… ఆయన కూడా నీటి కనెక్షన్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదని… వేరే సమస్యలు ఉన్నా యంటూ దాటేశారన్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో త‌న త‌ప్పు ఏమీ లేద‌ని కోటంరెడ్డి చెప్పుకొ చ్చారు.

అయితే, సీఎం జ‌గ‌నే అరెస్టుకు ఆదేశించిన నేప‌థ్యంలో త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు. అయి తే, కేసు విచార‌ణ‌లో అన్ని వాస్త‌వాలు వెలుగు చూస్తాయ‌ని చెప్పారు. మూడు నెలలుగా వాటర్ కనెక్షన్‌కు అనుమతి ఇవ్వకపోవడంతోనే తాను ఆమెకు ఫోన్ చేశానని… విచారణలో అన్నీ బయటకు వస్తాయని కో టంరెడ్డి అన్నారు. మొత్తానికి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డిపై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకే పార్టీలో ఉంటూ.. ఒకే జిల్లాలో ఇలా ఆధిప‌త్య ధోర‌ణి రాజ‌కీయాలు చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ విష‌యం ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version