కాంగ్రెస్ పార్టీకి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ షోకాజ్ ఇచ్చిన నేపథ్యంలోనే … కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పాడి కౌశిక్ రెడ్డి. కాసేపట్లో తెలంగాణ పీసీసీకి తన రాజీనామా లేఖను పంపనున్నారు. ఆడియో టేపు వైరల్ అయిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు… టీఆర్ఎస్ పార్టీ భారీ ఆఫర్ రావడంతోనే కౌశిక్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
అయితే… ఈ రాజీనామాపై మరికాసేపట్లోనే కౌశిక్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా… పాడి కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అయిన నేపథ్యంలో..ఆయనకు టీపీసీసీ ఇవాళ ఉదయమే… షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్న టీపీపీసీ… టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు అనేక ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా ఆయన తీరుమారలేదని చెప్పిన పీసీసీ…. 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.