కాంగ్రెస్ ధ‌ర్నాలో అపశ్రుతి

-

దేశంలో పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెల్సిందే. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు ఎడ్లబండ్ల మీద నిరసనలు తెలిపారు.

కాంగ్రెస్ /congress

అయితే మెదక్‌లో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదవశాత్తు ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయన్ను పక్కకు లాగారు. రాజనర్సింహ ప్రసంగిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ మోకాలికి స్వల్ప గాయం కాగా వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version