కేటిఆర్ దెబ్బకు తన కొంపను తానే ముంచుకున్న కాంగ్రెస్…!

-

తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ అయినా తెచ్చింది మాత్రం కెసిఆర్” ఈ మాటకు చావు లేదా…? మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కనీవినీ ఎరుగని రీతిలో అధికార తెరాస పార్టీ పూర్తి స్థాయిలో విపక్షాల మీద ఆధిపత్యం ప్రదర్శించింది. కెసిఆర్ వ్యూహాల ముందు కాంగ్రెస్, బిజెపిలు పూర్తిగా తేలిపోయాయి. రెండు పార్టీలు కలిపి కనీసం పది స్థానాలు కూడా గెలవలేదు.

ఊహకందని రీతిలో విజయం సాధించింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తెరాస తో పోటీ పడటం మాని బిజెపితో పడింది ఆ పార్టీ. దీనితో కేవలం 5 నుంచి 7 స్థానాలకే ఆ పార్టీ పరిమితం అయింది. దీనికి కారణం ఆ పార్టీలో అంతర్గత విభేదాలే. ఒకపక్క తెరాస లో కేటిఆర్ దూకుడుగా వెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం వర్గ విభేదాలతోనే నెట్టుకొచ్చింది. రెబల్స్ ని అడ్డం పెట్టుకోవాలని చూసింది.

దీనిని కేటిఆర్ సమర్ధంగా ఎదుర్కొన్నారు. అదే విధంగా కేటిఆర్ చేసిన విమర్శలపై ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా సమాధానం ఇవ్వలేదు. కనీస౦ తెలంగాణకు మేము ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఒక పక్క కేటిఆర్ సమర్ధవంతంగా ప్రచారంలో దూసుకుపోతుంటే, కాంగ్రెస్ నేతలు ఆయన ఎం మాట్లాడుతున్నారో విన్నారు గాని ఎక్కడా కూడా సరైన సమాధానం ఇవ్వలేదు.

రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తుంటే ఆయన్ను అడ్డుకునే ప్రయత్నాలు చేసారు నేతలు. ఇక చీఫ్ గా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి అయితే పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధ్యక్షులు దూకుడుగా వెళ్లి విజయాలు సాధిస్తుంటే ఈయన ఎంత సేపు బుజ్జగింపులతోనే సమయం అంతా నెట్టుకొచ్చే ప్రయత్నం చేసారు. రాష్ట్ర స్థాయి నాయకత్వం టికెట్ల ఎంపికలో తలదూర్చడం మరింత కొంప ముంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version