కర్నూలు ‘ఫ్యాన్’ అభ్యర్థులు ఫిక్స్ .! మళ్లీ స్వీప్ చేస్తారా!?

-

ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 2019లో జిల్లాలోని 14 ఎమ్మెల్యే సీట్లు వైసిపినే సొంతం చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది కానీ ఈసారి సర్వేల ప్రకారం వైసీపీకి 9 /10 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. టిడిపికి 4/5 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో లాగానే అన్ని స్థానాలలో గెలివాలని  వైసీపీ గట్టి వ్యూహరచనలో ఉంటే, టిడిపి కూడా దానికి తగ్గట్టుగా ప్రజల్లో పట్టున్న నాయకులను ఎంచుకొని నియోజకవర్గాలలో పట్టు పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది.

ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో 75 మందితో తొలి జాబితా విడుదల చేయడానికి జగన్ రెడీ అవుతున్నారనే విషయం సంచలనం రేపుతోంది. ఇక గత ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలలో ఆరుగురికి టికెట్ కన్ఫర్మ్ అయింది అనే విషయంపై సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

తొలి జాబితా విడుదల చేశారంటూ సామాజిక మాధ్యమాలలో వస్తున్న జాబితాలో కర్నూలు జిల్లాలోని డోన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, పత్తికొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, శ్రీశైలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్లు విన్పిస్తుండగా, ఎమ్మిగనూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి ఖరారైనట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మంత్రాలయం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి వై.సాయిప్రసాద్ రెడ్డి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ జాబితాపై జిల్లా అధ్యక్షులు గాని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గానీ స్పందించకపోవడం గమనార్హం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు.

అటు వర్గ పోరు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే  నియోజకవర్గాలైన నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, శాప్ చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తారనే టాక్ ఉంది.

అటు కోడుమూరు సీటు విషయంలో నేతలతో చర్చించనున్నారు. కర్నూలు సెగ్మెంట్ లో ఎమ్మెల్యే డాక్టర్ హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలున్నాయి. వీరందరిని కలిపి పార్టీ గెలుపునకు కృషి చేసేందుకు అధిష్టానం ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయ పరచుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రజలలో వ్యతిరేకత ఉన్న స్థానాలలోని ఎమ్మెల్యేలకు స్వస్తి పలకాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ వారసులకు ఈసారి టికెట్ కావాలని కోరుకుంటున్న జగన్ మాత్రం వారే పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా కర్నూలు లో స్వీప్ చేయాలని చూస్తున్నారు. మరి స్వీప్ చేస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version