నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 

-

భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దేశంలో ప్రఖ్యాతిగాంచిన టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పలు ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 78 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ iitr.ac.in ని సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 30, 2023 గా నోటిఫికేషన్ లో వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం.. గ్రూప్ బీ మరియు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నడుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 ఖాళీ పోస్టును భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రూపు బీ పోస్టుకు 31 ఖాళీలు, గ్రూప్ సీ పోస్టులకు 47 ఖాళీలు ఉన్నట్టు నిర్ణయించారు. ఈ డ్రైవ్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ/EWC కేటగిరికి రూ.400 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ,పీడ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version