నిరసన పేరుతో విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకొం – జీహెచ్ఎంసీ మేయ‌ర్

-

నిర‌స‌న పేరు తో విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని బీజేపీ కార్పొరేట‌ర్ల పై జీహెచ్ ఎంసీ మేయ‌ర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జిహెచ్ఎంసీ కార్యాల‌యం పై బీజేపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామ‌ని అన్నారు. గతంలో చాలా సార్లు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేశారని అన్నారు. కానీ ఈ సారి ధ‌ర్న కాకుండా విధ్వంసం చేశార‌ని అన్నారు.

బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేసింది పబ్లిక్ ప్రాపర్టీ నే కాదా అని అన్నారు. అలాగే తాను టీఆర్ఎస్ మేయర్ లా కాకుండా కార్పొరేటర్లు అందరిని కలుపుకొని వెళ్తున్నాని తెలిపారు. మీ అధిష్టానం ఆదేశాల‌తో కార్యాల‌యం పై దాడి చేశారా అని ప్ర‌శ్నించారు. ఒక వేళ అధిష్టానం చెబుతి సిగ్గు లేకుండా దాడి చేస్తారా అని విమ‌ర్శించారు. జనరల్ బాడీ స‌మావేశం నిర్వ‌హించాల‌ని అనుకున్నాం.. కాని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని పెట్టుకోలేద‌ని అన్నారు. గ్రేటర్ లో అభివృద్ధి పనులు చాలా చేస్తున్నామ‌ని తెలిపారు. అవి కనపడటం లేదా అని ప్ర‌శ్నించారు. నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయని అది ఓర్వ‌లేకే ఇలాంటి దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version