బ్రేకింగ్‌ : మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా రాష్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్.. హుజూర్‌న‌గ‌ర్ కూడా…

-

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అదే నెల 24న ఈ రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. ఇక ఈ ఎన్నిక‌ల‌కు సెప్టెంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు.

వీటితో పాటు తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక కూడా అక్టోబర్ 21నే జరుగుతుంది. ఫలితం 24న బయటకు వస్తుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి న‌ల్ల‌గొండ ఎంపీగా గెల‌వ‌డంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా అసెంబ్లీ స్థానాల‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 64 స్థానాలకు కూడా అక్టోబర్ 21నే పోలింగ్ నిర్వహిస్తారు.

ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 23న విడుదలవుతుంది. 30 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంటుంది. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. 8.94 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి నవంబర్‌ 9తో ముగుస్తోంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. హర్యానా అసెంబ్లీ కాలపరిమితి నవంబర్‌ 2తో ముగుస్తుంది.

ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డంతో ఈ ఎన్నిక‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఆసక్తి నెల‌కొంది. ఈ ఎన్నికల్లో ఈసీ కఠిన నిబంధనలు విధించింది. ఎన్నికల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అభ్యర్థులు తమ ప్రచారంలో ప్లాస్టిక్ ఉపయోగించకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితిని గరిష్టంగా రూ.28 లక్షలుగా నిర్ణయించారు. నామినేషన్ పత్రంలో ఒక్క కాలమ్ వదిలినా నామినేషన్ రద్దవుతుందని ఈసీ చెప్పారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version