దేశంలో విస్తృతంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ని తగ్గించడానికి సీనియర్ ఆర్ధికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొన్ని సూచనలు కేంద్రానికి ఇచ్చారు. దేశంలో వైరస్ సవాళ్లను అధిగమించడానికి కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరమని తెలిపారు. అంతేకాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు టెస్ట్ కిట్లను పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలని తెలిపారు. చాలా రాష్ట్రాలలో టెస్టింగ్ కిట్ల కొరత ఉందని అన్నారు. ఇదే టైములో కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ దారులకు ఇటీవల డీఏ నీ కేంద్ర ప్రభుత్వం నిలిపి వేయడం అన్నది సరైన నిర్ణయం కాదని మన్మోహన్ అన్నారు.
అయితే కరోనా వైరస్ రాకతో చెల్లించాల్సిన నెక్స్ట్ డీఏ ను 2021 జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక సమస్యలు పునరావృత్తం అవుతాయని సీనియర్ ఆర్థికవేత్త మన్మోహన్ చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. మన్మోహన్ చెప్పింది కరెక్ట్ అని, సీనియర్ ఆర్థికవేత్తగా ఆయన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని సూచించారు.