మాకు సంపూర్ణేష్‌ బాబు అయినా… పవన్‌ కళ్యాణ్‌ ఒక్కటే : మంత్రి అనిల్

-

జనసేన అధినేత పవన్‌ కు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని.. తమ ప్రభుత్వానికి అందరూ సమానమేనని తెలిపారు. ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో చర్చించారని… ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం ? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి ? అని పవన్‌ కు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అనిల్‌.


పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్.. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమని…. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురు మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది ఇది ఎంతవరకు సబబు ? అని ప్రశ్నించారు. తన ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదని… ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని చురకలు అంటించారు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని… రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరును మారుస్తాను.. నేను రోడ్డు కొస్తే మనిషిని కాదు.. బెండు తీస్తాం.. అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశామని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version