ఈటల మునిగిపోయే పడవలో ఎక్కారు

-

ఈటల రాజేందర్ మునిగిపోయే పడవలో ఎక్కారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేసారు. ఈటల బీజేపీలో చేరిన నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదమని అన్నారు. ఈటల చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదని, ఈటల హిట్లర్ వారసుల సరసన చేరారని మండిపడ్డారు.

ప్రతీ పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమన్న మంత్రి… ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ లో పెద్దగా సమస్యలు లేవని అన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే ఈటల సమస్యలు పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించారు. ఈటలకు ముందు నుంచే ప్రత్యేక ఎజెండా ఉందని బీజేపీలో చేరడం ద్వారా రుజువైందని అన్నారు. మొన్నటి దాక బీజేపీని విమర్శించిన ఈటల ఇపుడు బీజేపీ ఏం మారిందని ఆ పార్టీలో చేరాడని ప్రశ్నించారు.

ఈటల మునిగిపోయే పడవలో ఎక్కారని ఆయనతో బీజేపీలో చేరిన వారు కూడా మునిగిపోతారని అన్నారు. హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరడంపై వారికి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేసారు. హుజురాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన వాళ్ళే నష్టపోతారని పార్టీకి మాత్రం ఏం కాదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తనపై విచారణ పూర్తి అయ్యేదాకా ఈటల టీఆర్ఎస్ లోనే ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version