తమిళనాడు లో ఇటీవల మంత్రిగా ఉన్న బాలాజీ ఇంటి పై ఈడి దాడులు చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడన్న కారణంగా మంత్రిని అరెస్ట్ చేశారు.. ఇది జరిగిన కొంత కాలానికి ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మరియు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇంటిపై ఈడి అధికారులు దాడి చేయాలని ప్లాన్ లో ఉన్నారని స్వయంగా ఉదయనిధి స్టాలిన్ బయటపెట్టాడు. ఈయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు మా ఇంట్లో ఈడి అధికారులు సోదాలు చేస్తారని చెబుతున్నారని అన్నారు, మా ఇంట్లో సోదాలు చేసే దమ్ము ఈడి కి ఉందా అంటూ ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించాడు ? ఎవ్వరైనా ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి సోదాలు చేసుకోవచ్చు అంటూ చెప్పాడు.
ఈడి అధికారులకు ఉదయనిధి “స్టాలిన్” సవాల్… !
-