బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు ప్రాంతాలకు ఒకటే రాజధానిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న డయ్యూ డామన్ – దాద్రా నగర్ హవేలీలకు డామన్‌ను రాజధానిగా మోడీ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేసారు.
కాగా ఇప్పటి వరకు డయ్యూ డామన్‌కు డామన్, దాద్రా నగర్ హవేలీకి సిల్వాసా హెడ్ క్వార్టర్స్‌గా ఉండగా ఈ రెండింటికీ కలపి డామన్నే రాజధానిగా చేస్తూ కేంద్ర౦ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. రాజధానిని ఒక ప్రాంతం నుంచి మరో రెండు ప్రాంతాలకు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం,
నిర్ణయం తీసుకోని దాన్ని కేబినేట్ లోను, రాష్ట్ర శాసన సభలోనూ ఆమోదం తెలిపారు. అయితే మండలిలో అది ఆమోదం పొందలేదు. అయితే మూడు రాజదానులకు కేంద్రం మద్దతు ఉందనే వైసీపీ ప్రచారానికి కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తగిలింది. మూడు రాజధానులు అని కేంద్రం అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకటే రాజధాని అని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.