వివాదాలకు కెరాఫ్ గా మోధీ తలపాగా..

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓ తలపాగా వివదాలకు తావునిచ్చింది. మహారాష్ట్రలోని పుణెలో ప్రఖ్యాత సంత్ తుకారాం మహరాజ్ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నందున ఆ సమయంలో ఆయన ధరించేందుకు ఈ టర్బన్‌ను రూపొందించారు..

తుకారాం అభంగాలలోని కొన్ని పదాలను తలపాగాపై ముద్రించారు. అయితే, ఈ పదాలను మార్చాలంటూ దేహు సంస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పుణెలోని మురుద్‌కర్ ఝెండేలావా దుకాణ యజమాని ఈ ప్రత్యేక తలపాగాను డిజైన్ చేశారు. దెహు టెంపుల్ ఆదేశాల మేరకు తలపాగాను ఆయన డిజైన్ చేశారు. అయితే, దానిపై (టర్బన్) రాసిన రాతల పట్ల సంస్థాన్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు..

మనిషి ప్రవర్తన మంచిగా ఉంటే వారికి అంతా మంచి జరుగుతుంది.చెడు ఆలోచనతో ఉంటే అలా చెడుగా ఫలితాలు కూడా ఉంటాయని టర్బన్ లో రాసి ఉంది.ఈ రాతలను వెంటనే మార్చాలని దేహు సంస్థాన్ అధ్యక్షుడు నితిన్ మహరాజ్ ఆదేశించారు. దాంతో ”విష్ణుమయ్ జగ్ వైష్ణవాంచ ధర్మ, భేదాభేద్ ధర్మ అమంగళ్” అంటూ ఆ రాతలను సవరించి తిరిగి తలపాగాను డిజైన్ చేయడంతో వివాదానికి తెరపడింది.

మహారాష్ట్రలో ఒకరోజు పర్యటనకు ప్రధాని మోదీ వచ్చారు. ఇందులో భాగంగా దేహులోని 17వ శతాబ్దానికి చెందిన సంత్ తుకారాం మహరాజ్‌ పేరిట ఒక ఆలయాన్ని ప్రారంభించనున్నారు.ముంబై సమాచార్ పత్రిక ద్విశాబ్ది మహోత్సవ్ లో పాల్గోనున్నారు.200 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఘనంగా చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version