వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత ఎంపీ.. అచ్చెన్నను అరెస్ట్ చేయడం తప్పు..!

-

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంతో రాష్ట్రం రాజకీయమంతా ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విమర్శలకు ప్రతివిమర్శలతో నేతలు రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా అచ్చెన్న అరెస్ట్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనే షాక్ కి గురి చేసేలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు నిజంగా తప్పుచేస్తే చర్యలు తీసుకోవాలని కానీ గోడ దూకి మరీ అరెస్ట్‌ చేయాల్సిన అవసరంలేదని అన్నారు. అయితే టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్ట్ అవుతారని మంత్రులు అనడం సరికాదని, మంత్రుల వ్యాఖ్యలతో నిజంగా వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని అనుకుంటారని అది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం నిజంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని దీనిని నేను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version