కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. ‘ఏడాది విజయోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్‌కౌంటర్ ఏంది? అని మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు..బూటకపు ఎన్‌కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయన్నారు. అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని, ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని అన్నారు.బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్కౌంటర్లు అంటూ ఫైర్ అయ్యారు.
ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది?
అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.
బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయి.
అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు.
ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన…
— Harish Rao Thanneeru (@BRSHarish) December 1, 2024