తిరుమలలో తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.‘ఫెయింజల్’ తుఫాన్ వలన ఏపీలోని తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశ గంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.
ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 5 జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నది.పాప వినాశనం డ్యామ్‌లో 693.27 మీటర్ల నీటి మట్టం, ఎఫ్ఆర్ఎల్ 697.14 మీటర్లుగా ఉంది.గోగర్భం డ్యామ్‌లో 2,894 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 2,894 అడుగులు, ఆకాశగంగ డ్యామ్‌లో 855.00 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 865.00 మీటర్లు, కుమారధార డ్యామ్‌లో 890.80 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 898.24 మీటర్లు, పసుపుధార డ్యామ్‌లో 896.35మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 898.24 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు.