క్రికెట్ కు పోటీ ఇచ్చేలా కబడ్డీని తయారు చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి కొండపల్లి. విశాఖలో కబడ్డీ అసోసియేషన్ నూతన కమిటీ సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ… విశాఖ ను క్రీడా రంగ హాబ్ గా తీర్చిదిద్దుతామని… కబడ్డీ కి జాతీయస్థాయిలో స్థానం కల్పిస్తామన్నారు.
క్రికెట్ పోటీ ఇచ్చేలా కబడ్డీ ని తయారు చేస్తామని… క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎమ్ ఎస్ ఎమ్ ఈ కోసం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తామని.. చిన్న మధ్యతరగతి తరహా వ్యాపారస్తులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ప్రకటించారు. మండల స్థాయిలో ఎమ్ ఎస్ ఎం ఈ అవగాహన కొరకు అసిస్టెంట్లను నియమిస్తామని…కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెండింగ్ లో ఉన్న రహదారి పనులను పూర్తి చేస్తున్నామన్నారు ఏపీ మంత్రి కొండపల్లి.