ఎన్నికల ప్రచారానికి ‘జబర్దస్త్’ బూతులనే నమ్ముకున్న నాగబాబు..!

-

నేను పుట్టింది మొగల్తూరులో. నరసాపురం తాలూకా హైస్కూల్ లో చదువుకున్నా. వైఎన్ కాలేజీలో ఇంటర్ వరకు చదివా. నేను పశ్చిమ గోదావరి మొత్తం తిరిగా. నా భార్య సొంతూరు కూడా పశ్చిమ గోదావరే.

నాగబాబు అంటే గుర్తుకొచ్చేది బూతుల షో జబర్దస్త్. ఆ తర్వాతే మెగా బ్రదర్. ఇంకా ఆ తర్వాతే జనసేన నాయకుడు, నరసాపురం ఎంపీ అభ్యర్థి. అవును.. నాగబాబుది ఒక ఫెయిల్యుర్, అస్తవ్యస్తమైన స్టోరీ. ఏదో అటు అన్న.. ఇటు తమ్ముడు ఆదుకుంటున్నారు కాబట్టి.. ఈమాత్రం నెగ్గుకొస్తున్నారు కానీ.. అటు అన్న.. ఇటు తమ్ముడు లేకపోతే నాగబాబు ప్రస్తుతం ఇలా ఉండేవారే కాదు. సరే.. అవన్నీ పక్కన బెడితే.. ఎంపీ అభ్యర్థి కదా.. ప్రచారం మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు. కాకపోతే ఎన్నికల్లో పోటీ అన్నాక మాటల యుద్ధాలు కామన్ కానీ.. మొన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబు మాత్రం తన ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు దించేస్తున్నారు. నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు భగ్గుమన్నారు.

ఎవడా రాస్కెల్ నేను నాన్ లోకల్ అన్నది..

ఎవడా రాస్కెల్ నేను నాన్ లోకల్ అన్నది.. అసలైన స్థానికుడిని నేనే. ఆ వెధవలకు ఏం తెలుసు నా గురించి. ఆ రాస్కెల్స్ కంటే నేను బెటర్. నన్ను నాన్ లోకల్ అంటాడా? ఆ సన్నాసి ఎవడు. నన్ను విమర్శించే వాళ్లకు ఏం తెలుసు వాళ్ల బొంద. వాళ్లంతా యూజ్ లెస్ ఫెలోస్. వాళ్లంత పనికిమాలిన సన్నాసులు ఎవరూ ఉండరు.. అంటూ జబర్ధస్త్ బూతులను మించిపోయి తిట్టేశారు నాగబాబు.

నా మూలాలు పశ్చిమ గోదావరిలో ఉన్నాయి..

నేను పుట్టింది మొగల్తూరులో. నరసాపురం తాలూకా హైస్కూల్ లో చదువుకున్నా. వైఎన్ కాలేజీలో ఇంటర్ వరకు చదివా. నేను పశ్చిమ గోదావరి మొత్తం తిరిగా. నా భార్య సొంతూరు కూడా పశ్చిమ గోదావరే. మా నాన్నది పెనుగొండ. నా కుటుంబం మొత్తం మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఈ సన్నాసులకు ఏమున్నాయి. సొల్లు మాటలు, వెధవ కబుర్లు చెప్పడానికి తప్పితే వీళ్లు దేనికీ పనికిరారు.. అంటూ నాగబాబు మండిపడ్డారు.

రఘురామరాజు లోకలా? ఆ రాస్కెల్ కంటే నేను బెటర్

నాపై పోటీ చేస్తున్న రఘురామరాజు లోకలా? ఆయన బాగోతం అందరికీ తెలుసు. పండుగలు వచ్చినప్పుడు బెట్టింగ్ లు చేసే వాళ్లు, పైరవీలు చేసుకునే వాళ్లు.. వాళ్లకు సిగ్గుందా? రోజుకో పార్టీ మారే రఘురామ రాజు లోకలా? వీళ్లను మనం గెలిపించాలా? నేను అసలైన లోకల్ అంటే. ప్రజలకు ప్రేమతో సేవ చేసేవాడే నిజమైన లోకల్. ఈ రాస్కెల్స్ కంటే నేను చాలా బెటర్.. అంటూ నాగబాబు రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version